FAQs

faq తరచుగా అడిగే ప్రశ్నల

  • general enquiry

    చల్లదనం కొరకు సాధారణ సూచనలు

  • settings

    నిర్వహణ విచారణ

  • warranty

    సమస్య పరిష్కార మార్గదర్శకం

  • saftey

    భద్రతా మరియు వారంటీ

ఏదైనా ఇతర ప్రశ్నలు ఉన్నాయా? మాకు సమాధానాలు ఉన్నాయి

మమ్మల్ని సంప్రదించండి
settings

నిర్వహణ విచారణ

  • A. హనీకూంబ్ ప్యాడ్ ని ఎప్పుడు శుభ్రం చేయాలి?  

    1. హనీకూంబ్ సాధనంను శుభ్రం చేసే కాలం స్థానిక గాలి మరియు నీటి పరిస్థితి ఆధారం మీద ఉంటుంది. నీటిలో ఖనిజ పదార్ధం అధికంగా ఉన్న ప్రదేశాలలో, ఖనిజం హనీకూంబ్ కూలింగ్ మీడియా మీద పేరుకు పోవచ్చును మరియు గాలి ప్రవాహం ను నిరోధించవచ్చును.
    2. కనీసం వారానికి ఒకసారి నీటి జలాశయంను ఖాళీ చేయడం మరియు తాజా నీటితో నింపడం వలన ఖనిజాలు పేరుకుపోవడం తగ్గించడానికి సహాయపడుతుంది. హనీకూంబ్ మీడియాలో ఖనిజాలు పేరుకుని ఉన్నట్లయితే, మీడియాని తొలగించాలి మరియు తాజా నీటితో కడగాలి..
    3. మీ అవసరాల ఆధారంగా ప్రతి రెండు నెలలకి ఒకసారి లేదా అంతకంటే తొందరగా మీడియాని శుభ్రం చేయాలి.
  • B. హనీకూంబ్ ప్యాడ్ ని ఎలా శుభ్రం చేయాలి?  

    1. యూనిట్ ఆపివేయాలి, మరియు గోడకి ఉన్న విద్యుచ్చక్తి ఔట్లెట్ నుండి పవర్ కాడ్ ని తీసివేయాలి, వెనుక పానెల్ కనిపించే లాగా యూనిట్ ని తిప్పాలి, మరియు ముందు గ్రిల్ ని ఉంచండి.
    2. స్క్ర్యూ డ్రైవర్ తో స్క్ర్యూ లను తొలగించాలి.
    3. ముందు గ్రిల్ పానెల్ ని పూర్తిగా తొలగించచేంత వరకు పై దిశగా లాగాలి. ఇప్పుడు, హనీకూంబ్ మీడియాని చూడవచ్చును. తాజా నీటితో హనీకూంబ్ మీడియాని శుభ్రం చేయాలి.
    4. ఒక్కసారి శుభ్రం చేయడం పూర్తైన తర్వాత, యూనిట్ ని తిరిగి బిగించాలి.
    5. పవర్ సాకెట్ లో ప్లగ్ ని పెట్టాలి మరియు యూనిట్ ని మొదలుపెట్టాలి.
  • C. ట్యాంక్ ని ఎలా శుభ్రం చేయాలి?  

    1. పవర్ ని ఆపివేయాలి మరియు పవర్ సాకెట్ నుండి ఎయిర్ కూలర్ ప్లగ్ ని తీసివేయాలి.
    2. ఖాళీ చేయగలిగే ప్రదేశానికి యూనిట్ ని తరలించాలి. నీటిని ఖాళీ చేసే ప్లగ్ (ట్యాంక్ అడుగు బాగం లో ఉంటుంది) నుండి క్యాప్ ని తీసివేయాలి మరియు ట్యాంక్ ఖాళీ చేయాలి.
    3. ట్యాంక్ ని ఖాళీ చేసిన తర్వాత, దయచేసి నీటిని ఖాళీ చేసే ప్లగ్ ని దాని యధాస్థానంలో పెట్టాలి.
    4. ఇప్పుడు నీటి ట్యాంక్ ని గరిష్ఠ స్థాయికి తిరిగి నింపాలి, ఐదు నిమిషాలు ఆగాలి, తర్వాత మరొక సారి మొత్తం నీటిని ఖాళీ చేయాలి. ఈ ప్రక్రియ కొరకు శుభ్రమైన నీటిని ఉపయోగించాలి, అందువలన ధూళి పదార్థాలను గరిష్టంగా మరియు కలుషితాలను పూర్తిగా తొలగించవచ్చును.
    5. ఎక్కువ కాలం కొరకు కూలర్ని ఉపయోగించనట్లయితే, దానిని తిరిగి ఉపయోగించే ముందు నీటి ట్యాంక్ కనీసం 2 సార్లు శుభ్రం చేయాలని సూచించడమైనది.
warranty

సమస్య పరిష్కార మార్గదర్శకం

  • A. ఒకవేళ గాలి రాకపోతే ఏమి చేయాలి?  

    1. కార్డ్ ని ప్లగ్ లో పెట్టారా అని తనిఖీ చేయాలి - కార్డ్ ని ప్లగ్ లో పెట్టేలా మరియు పవర్ సరఫరా ఉండేలా నిర్ధారణ చేసుకోవాలి.
    2. పవర్ ఆన్ లో లేకపోతే- కంట్రోల్ పానెల్ యొక్క మెకానికల్ నాబ్ స్థితిని మార్చడం ద్వారా యూనిట్ ని ఆన్ చేయాలి
    3. మోటార్ లోపం-సేవా కేంద్రంను సంప్రదించాలి.
  • B. b. కూలర్ శబ్దం చేసినట్లయితే/కూలింగ్ అవకపోతే ఏమి చేయాలి?  

    1. పంపు ని ఆన్ చేయలేదేమో అని తనిఖీ చేయాలి. కంట్రోల్ పానెల్ ని ఆన్ చేయాలి. కూల్ ఫంక్షన్ “ఆన్” చేయడానికి తిప్పాలి.
    2. ట్యాంక్ లో తక్కువ నీటి స్థాయి లేదా నీరు లేదా అని తనిఖీ చేయాలి.కూల్ ని ఎంచుకున్నప్పుడు పంపు ఆన్ అవుతుంది మరియు ట్యాంక్ లో తక్కువ నీరు లేదా నీరు లేకపోయినప్పుడు పంపు శబ్దం చేస్తుంది. ఈ పరిస్థితులలో నీటి ట్యాంక్ ని తిరిగి నింపాలి.
    3. పంపు చెడిపోయినట్లయితే తనిఖీ చేయాలి.మరమ్మత్తుల కొరకు సేవా కేంద్రంను సంప్రదించాలి.
  • C. కూలర్ నుండి అసహజ వాసన/దుర్గందం వస్తే ఏమి చేయాలి?  

    1. i. కూలర్ కొత్తది అయినప్పుడు - ఇది సాధారణంగా సంభవిస్తుంది. యూనిట్ మొదటి సారిగా ఉపయోగించినప్పుడు, హనీకూంబ్ కూలింగ్ మీడియా ఒక దుర్గందం ని కలిగి ఉంటుంది, ఇది మొదటగా ఉపయోగించిన్ వారం లోపు పోతుంది.
    2. ii. కూలర్ ఉపయోగించినది అయితే - ఆల్గే సమస్య ఉండవచ్చును.
      ఈ సమస్యను పరిష్కరించడానికి::
      1. ట్యాంక్ లో నీటి స్థితిని తనిఖీ చేయాలి నిల్వ నీరు ఉన్నప్పుడు ట్యాంక్ ని శుభ్రం చేయాలి మరియు తాజా నీటితో నింపాలి
      2. హనీకూంబ్ కూలింగ్ మీడియాను శుభ్రం చేయాలి
      3. సమస్య ఇంకా ఉన్నట్లయితే, సేవా కేంద్రంను సంప్రదించాలి
saftey

భద్రతా మరియు వారంటీ

  • A. వారంటీ యొక్క చెల్లుబాటు  

    1. ఉపకరణం ఇన్స్టాల్ చేయబడినది, ఉపయోగించబడినది మరియు సూచన మార్గదర్శి ప్రకారం నిర్వహించబడినది.
    2. ఆధీకృత డీలర్ చేత సంతకం చేయబడిన వారంటీ కార్డు మరియు క్యాష్ బిల్లును ఫిర్యాదుతో పాటు సమర్పించాలి.
    3. ఉపకరణం విప్పలేదు లేదా ఎవరైనా ఆధీకృత వ్యక్తి చేత, తో చింపబడలేదు.
  • B. వారంటీ ఎప్పుడు వర్తించదు? 

    1. చిప్పింగ్, పీలింగ్, ప్లేటింగ్ మరియు డెంటింగ్ కారణంగా దెబ్బతిన్నప్పుడు.
    2. బెక్ లైట్, యూరియా, ఎబిఎస్, ఎస్ఏఎన్ మరియు లాంటి ప్లాస్టిక్ వస్తువులు, రబ్బర్ భాగాలు మరియు తాడు నుండి తయారుచేసిన భాగాలు దెబ్బతిన్నప్పుడు మరియు విరిగిపోయినప్పుడు.
    3. సాధారణ భాగాలను తీయడం మరియు పెట్టడం.
    4. వినియోగదారుని వైపు నుండి ప్రమాదాలు, సరిగా నిర్వహించకపోతే లేదా అజాగ్రత ఫలితంగా దెబ్బతిన్నప్పుడు
  • C. భద్రతా చిట్కాలు  

    1. మీ కూలర్ 230 వోల్ట్ ఏసీ, 50Hz మీద నడుస్తుంది. ఉపకరణం మీద పేర్కొనబడిన రేటింగ్ కి సరిపోయేలా ఇంటి లోని పవర్ వోల్టేజి ఉండేలా తనిఖీ చేయాలి.
    2. ఉత్పత్తిని నడిపించే ముందు దాని ప్యాకెట్ నుండి బయటకు తీయాలి మరియు అది మంచి స్థితిలో ఉందని తనిఖీ చేయాలి.
    3. దెబ్బతిన్న కార్డ్ లేదా ప్లగ్ తో ఏదైనా ఉత్పత్తిని ఆపరేట్ చేయరాదు. ఈ ఉపకరణానికి ఎక్స్ టెన్షన్ కార్డ్ ని ఉపయోగించకూడదని సిఫార్సు చేస్తున్నాం.
    4. పవర్ కార్డ్ ని కార్పెట్ క్రింద లేదా రగ్గులు లేదా దుప్పట్ల క్రింద కప్పి ఉంచి ఉపయోగించకూడదు. జారిపోయే అవకాశం గల ప్రదేశాల నుండి కార్డ్ ని దూరంగా ఉంచాలి.
    5. నీటి ట్యాంక్ ని తిరిగి నింపేటప్పుడు కూలర్ ప్లగ్ ని ఎల్లప్పుడూ తీసివేయాలి.
    6. యూనిట్ ని శుభ్రం చేసేముందు, సర్వీసింగ్ లేదా వేరే స్థలానికి మార్చేటప్పుడు పవర్ సాకెట్ నుండి ఉపకరణం యొక్క ప్లగ్ ని ఎల్లప్పుడూ తీసివేయాలి.
    7. పవర్ కార్డ్ ప్లగ్ చివర మాత్రమే పట్టుకుని మరియు లాగడం ద్వారా విద్యుత్ హోల్డర్ నుండి పవర్ కార్డ్ ని తీసివేయాలి, కార్డ్ ని ఎప్పుడూ లాగకూడదు.
    8. గాసోలిన్, పెయింట్ లేదా ఇతర మండే వస్తువులు మరియు పదార్థాలను నిల్వ చేసిన ప్రదేశాలలో ఉత్పత్తిని ఉపయోగించకూడదు.
    9. “కూల్” సెట్టింగ్ ని ఉపయోగిస్తున్నప్పుడు, నీటి ట్యాంక్ నిండుగా ఉండేలా తనిఖీ చేయాలి. “కూల్” సెట్టింగ్ లో ట్యాంక్ ఖాళీ గా ఉన్నప్పుడు ఈ కూలర్ ని ఆపరేట్ చేస్తే, దాని ఫలితంగా నీటి పంపు దెబ్బతినవచ్చును.
    10. కూలర్ యొక్క ఏదైనా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఫంక్షన్ ని మరమ్మత్తు లేదా సర్దుబాటు చేయకూడదు, దీని వలన వారంటీ చెల్లుబాటు ఉండదు.
    11. ఉపకరణం లోని గాలి ఇన్లెట్ లేదా ఔట్లెట్ ని కప్పి ఉంచకూడదు, దీనివలన మోటారు దెబ్బతినవచ్చును.
    12. ఏదైనా వెంటిలేషన్ లేదా ఎక్సాస్ట్ ప్రవేశాలలో వస్తువులను చొప్పించకూడదు లేదా పెట్టకూడదు, దీనివలన ఉత్పత్తి దెబ్బతినవచ్చును మరియు ఎలక్ట్రికల్ షాక్ లేదా మండిపోవడానికి కారణం అవవచ్చును.
    13. హనీకూంబ్ మీడియాను తొలగించి నడపకూడదు, దీనివలన అధిక భారం పడుతుంది మరియు మోటార్ దెబ్బతింటుంది.
    14. నడుస్తున్న ఉపకరణంని ఒక పొడిగించిన కాలం కొరకు హాజరు కాకుండా ఉండకూడదు.
    15. ఈ ఉపకరణం తోమ పాకెట్ లేదా ప్లాస్టిక్ సంచులతో పిల్లలను ఆడనివ్వకూడదు.
    16. ఒకవేళ యూనిట్ దెబ్బతింటే లేదా పనివ్హేయలేకపోతే, నడిపించడంను కొనసాగించ కూడదు. సమస్య పరిష్కార విభాగం ను చూడాలి మరియు వృత్తి నిపుణుల సలహాను పొందాలి.
    17. యూనిట్ ని నేల స్థాయిలో ఉంచాలి. ఈ ఉత్పత్తిని తడి లేదా నీరు ఉన్న స్థలాలలో ఉపయోగించడానికి ఉద్దేశించినది కాదు.
    18. స్నానపు గదులలో ఉపయోగించకూడదు. ఒక నీటి పాత్రలో పడే ప్రదేశంలో ఉత్పత్తిని ఎప్పుడూ ఉంచరాదు.
    19. ఉపయోగం లో లేనప్పుడు ఒక పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. శారీరక వైకల్యం, ఇంద్రియ లేదా మానసిక సామర్థ్యం తక్కువగా ఉన్న వ్యక్తులు, లేదా అవగాహన మరియు అనుభవం లేని, వారి భద్రత కొరకు ఒక భాద్యతాయుత వ్యక్తి చేత ఉపకరణం ఉపయోగానికి సంబంధించి పర్యవేక్షణ లేదా సూచనలు ఇవ్వలేని వ్యక్తుల (పిల్లలు లేదా పెద్దలతో కూడి) చేత ఈ ఉపకరణం ఉపయోగించడానికి ఉద్దేశించినది కాదు.
    20. కూలర్ ని తరలించడానికి ఎల్లప్పుడూ సైడ్ హ్యాండిల్స్ లను పట్టుకోవాలి.